శాంసంగ్ ఈ మధ్యే తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. రూ.15 వేల లోపు ధరతోనే 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ లో మొబైల్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ గా మారింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు ఈ నెలలోనే రియల్ మీ 6, రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ అయ్యాయి. దీంతో ఈ ధరలో ఫోన్ కొనాలనుకునే వారికి లేటెస్ట్ ఫోన్లలో కూడా మళ్లీ కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ మూడు ఫోన్లలో బెస్ట్ ఏది? దేని ధర తక్కువ? ఎందులో అద్భుతమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి? వంటి వివరాలు తెలుసుకోవడానికి కథనాన్ని పూర్తిగా చదవండి
❂ రియల్ మీ 6: రూ.12,999 (4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్), రూ.14,999 (6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్), రూ.15,999 (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్)
❂ శాంసంగ్ గెలాక్సీ ఎం21: రూ.13,499 (4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్), రూ.15,499 (6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్)
❂ రెడ్ మీ నోట్ 9 ప్రో: రూ.12,999 (4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్), రూ.14,999 (6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్), రూ.15,999 (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్)
ఈ మూడు స్మార్ట్ ఫోన్లలో రియల్ మీ 6, రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ల ధర తక్కువగా ఉంది.