ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వైరస్ పేరే వినిపిస్తోంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలే ఈ వైరస్ వ్యాప్తిని ఆపలేక చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, 102 ఏళ్ల కిందట.. ఎలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు లేని రోజుల్లో.. కరోనా కంటే భయానకమైన వైరస్ ఒకటి ప్రపంచాన్ని వణికించింది. ముఖ్యంగా ఇండియాను కోలుకోలేని దెబ్బ తీసింది. వందలు కాదు.. వేలు కాదు.. కోట్ల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్‌కు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి సోకిన ఈ వ్యాధిని నియంత్రించేందుకు వైద్యులు చేయని ప్రయత్నం లేదు. అయితే, ఈ వైరస్ పుట్టింది చైనాలో కాదు.. స్పెయిన్‌లో. ఈ వైరస్ పుట్టుకే చాలా విచిత్రంగా జరిగింది. ఇది కూడా జంతువుల నుంచే పుట్టిందా? ఈ ఇండియాలోకి ఎలా ప్రవేశించింది? అప్పట్లో ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి ఎలా నియంత్రణలోకి వచ్చిందో తెలుసుకుంటే.. మీరు ఇంటి నుంచి బయట కాలు పెట్టే సాహసం కూడా చేయరు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (Covid 19).. స్పానిస్ వైరస్ కంటే ప్రమాదకరమైనది.ఈ వ్యాధి ముందుగా బాంబే (ఇప్పుడు ముంబయి)లో మొదలైంది. అందుకే దీన్ని బాంబే ఫ్లూ లేదా బాంబే వైరస్ అంటారు. అది స్పెయిన్ పుట్టిందనే సమాచారం తెలిసిన తర్వాత దాని పేరు స్పానిష్ ఫ్లూ లేదా Spanish influenza అని పిలవడం మొదలుపెట్టారు. బాంబే పోర్టులో పనిచేసే ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న అతడికి మలేరియా వచ్చిందేమోనని వైద్యులు భావించారు. వైద్య పరీక్షల్లో మలేరియాకు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదు. అయితే, ఆ వ్యాధి అతడి నుంచి ఇతరులకూ సోకింది. చాపకింద నీరులా బాంబే మొత్తం విస్తరించింది. ఒకరితో మొదలైన ఆ అంతుబట్టని వ్యాధి వేల మందికి చేరింది. ఈ వైరస్‌కు పాలకుల నిర్లక్ష్యం తోడైంది ఫలితంగా మరణాల సంఖ్య క్రమేనా పెరిగింది. అయితే, ఈ వైరస్ పుట్టింది బాంబేలో మాత్రం కాదు.. స్పెయిన్‌లో. అదెలా పుట్టిందో తెలుసుకొనే ముందు ఇండియా ఎదుర్కొన్న భయానక పరిస్థితులను తెలుసుకోవల్సిందే.
ఇండియాలో 2 కోట్ల ప్రాణాలు తీసిన స్పానిష్ వైరస్.. దీని పుట్టుకే విచిత్రం, ఎలా నియంత్రించారంటే