లాక్‌డౌన్‌పై మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

దేశంలో కరోనా కట్టడికి విధించిన రెండో విడత లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగనుండగా.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. వ్యవసాయ, ఉద్యానవన విభాగాలకు అనుమతించింది. అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సర్వీసులు మే 3 వరకు నిలిపివేయనున్నట్టు తెలిపింది. భద్రత విధులకు తప్ప బస్సు, రైలు మెట్రో సర్వీసులు నిలిచిపోతాయని పేర్కొంది. అత్యవసర వైద్యానికి మినహా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలు నిషేధించింది. ఎవరూ సరిహద్దులు దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది.నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దుచేసింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని పేర్కొంది. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేస్తారు.
నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దుచేసింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని పేర్కొంది. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేస్తారు.
⍟ అలాగే, సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం, మతప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలను కూడా నిలిపివేసింది. ట్యాక్సీ సర్వీసులకు కూడా అనుమతి నిరాకరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధిస్తామని పేర్కొంది.

⍟ హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు గుర్తించాలి. ఈ ప్రదేశాలలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదని తెలిపింది. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవని పేర్కొంది.